భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి 2026 కానుకగా థియేటర్లలోకి వచ్చిన ది రాజా సాబ్ కు షాక్ తగిలింది. సోమవారం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇండియాలో కేవలం రూ.5.4 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మూవీ రిలీజయ్యాక నాలుగో రోజు పరిస్థితి ఇలా ఉండటం ఫ్యాన్స్ కు మింగుడుపడనిదే. మరి మూవీ బడ్జెట్ ఎంత? రాజా సాబ్ హిట్ అవుతుందా?

ఈ ఏడాది ప్రభాస్ నటించిన భారీ చిత్రం రాజా సాబ్. ఈ హారర్-కామెడీ థ్రిల్లర్ గత శుక్రవారం (జనవరి 9) విడుదలైంది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, పెద్ద ఓపెనింగ్ మాత్రం సాధించింది. అయితే, ఆ ఊపును కొనసాగించలేకపోయింది. దురదృష్టవశాత్తు గత కొన్ని రోజులుగా వసూళ్లలో క్షీణత కనిపిస్తోంది.

రాజా సాబ్ కలెక్షన్లు నాలుగో రోజైన సోమవారం (జనవరి 12) దారుణంగా పడిపోయాయి. సక్నిల్క్ ప్రకారం రాజా సాబ్ నాలుగో రోజు ఇం...