Hyderabad, జూన్ 7 -- సుమారు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా థగ్ లైఫ్. అయితే, జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది థగ్ లైఫ్ మూవీ.

విడుదలైన రెండో రోజైన శుక్రవారం థగ్ లైఫ్ సినిమా భారీ పతనాన్ని చవిచూసింది. ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం థగ్ లైఫ్ సినిమాకు రెండో రోజు అయిన శుక్రవారం (జూన్ 6) నాడు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ .7.50 కోట్లు నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది.

ఇది ఓపెనింగ్ డేతో పోలిస్తే 55% తగ్గింది. అంటే, రిలీజ్ రోజున థగ్ లైఫ్ మూవీకి ఇండియాలో రూ. 15.5 కోట్ల (తెలుగులో 1.5 కోట్లు, తమిళం 13.35 కోట్లు, హిందీలో 65 లక్షలు) నెట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ, రెండో రోజు మాత్రం దారుణంగా పడిపోయాయి థగ్ లైఫ్ కల...