Hyderabad, జూలై 1 -- కన్నప్ప వసూళ్లు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా తొలి సోమవారం (జూన్ 30) టెస్టును పాస్ కాలేకపోయింది. తొలి మూడు రోజుల కంటే నాలుగో రోజు వసూళ్లు భారీగా తగ్గిపోయినట్లు Sacnilk.com రిపోర్టు వెల్లడించింది. ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన ఈ మూవీకి తొలి రోజు మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఆ తర్వాత అనూహ్యంగా పతనమవుతూ వస్తోంది.

విష్ణు మంచు నటించిన 'కన్నప్ప' మూవీ గత శుక్రవారం (జూన్ 27) థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు వసూళ్లు ఫర్వాలేదనిపించినా.. తర్వాతి రెండు రోజులు పడిపోతూ వచ్చాయి. నాలుగు రోజు ఇది మరింత పతనమైంది. తొలి సోమవారం ఈ సినిమా కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. Sacnilk.com తాజా రిపోర్టు ప్రకారం 'కన్నప్ప' మూవీ.. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.31.5 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చ...