భారతదేశం, నవంబర్ 10 -- మంచి బజ్​ నెలకొన్న లెన్స్​కార్ట్​ ఐపీఓ లిస్టింగ్​ దేశీయ స్టాక్​ మార్కెట్​లో సోమవారం నెగిటివ్​గా జరిగింది. ఇష్యూ ప్రైజ్ అప్పర్​ బ్యాండ్​​ రూ. 402తో పోల్చుకుంటే లెన్స్​కార్ట్​ షేర్లు.. బీఎస్​ఈలో 2.98శాతం తక్కువలో రూ. 390 వద్ద లిస్ట్​ అయ్యాయి. అదే సమయంలో, ఎన్​ఎస్​ఈలో 1.74శాతం నష్టాలతో రూ. 395 వద్ద ఓపెన్​ అయ్యాయి.

ప్రముఖ కళ్లజోళ్ల తయారీ సంస్థ అయిన లెన్స్​కార్ట్​ ఐపీఓకు ఫ్లాట్​ లిస్టింగ్​ దక్కుతుందని జీఎంపీ (గ్రే మార్కెట్​ ప్రీమియం) సూచించింది. లిస్టింగ్​కి ముందు ఓపెన్​ మార్కెట్​లో లెన్స్​కార్ట్​ షేర్లు దాదాపు 15 పాయింట్ల తక్కువలో ట్రేడ్​ అయ్యాయి.

ఈ ఐపీఓ ద్వారా రూ. 7,278 కోట్లు సేకరించాలని టార్గెట్​గా పెట్టుకుంది లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్. ఇందులో రూ. 2,150 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూతో పాటు 12.75 కోట్ల షేర్ల ఓఎఫ్​ఎస్​ (...