భారతదేశం, సెప్టెంబర్ 18 -- దసరా వేడుకలకు తెలంగాణ రెడీ అవుతోంది. హైదరాబాద్‌లో ఉండేవారు కొందరు ఊర్లకు వెళ్తారు. మరికొందరు ఇక్కడే ఉంటారు. సుదీర్ఘ సెలవులు వస్తుండటంతో కొన్ని పర్యాటక ప్రదేశాలు చూసి రావొచ్చు. కొందరు ఇంట్లో పండుగ ఉత్సాహంలో మునిగిపోతే మరికొందరు తమ బ్యాగులు సర్దుకుని టూర్స్ వెళ్తారు. అలాంటివారి కోసం కొన్ని ప్రదేశాలను తీసుకొచ్చాం.

లక్నవరం సరస్సు దట్టమైన అటవీ కొండలతో చుట్టుముట్టబడి ఉంది. వేలాడే వంతెనలు ఉంటాయి. ఇక్కడకు వెళ్లాలి అంటే వరంగల్ దాటాలి. హైదరాబాద్ నుండి 225 కి.మీ దూరం వస్తుంది.

సింగూర్ ప్రాజెక్ట్ అని కూడా పిలిచే సింగూర్ ఆనకట్ట.. సంగారెడ్డి సమీపంలో మంజీరా నదిపై ఉంటుంది. ఈ జలాశయం ప్రాంతం సుందరంగా ఉంటుంది. విశాలమైన బ్యాక్ వాటర్స్, ముఖ్యంగా కొన్ని నెలల్లో వలస పక్షులు, సమీపంలోని వ్యవసాయ భూముల పచ్చదనంతో ఉంటుంది. హైదరాబాద్ నుండి...