Hyderabad, సెప్టెంబర్ 20 -- దసరా నవరాత్రులు సమీపిస్తున్నాయి. నవరాత్రులు తర్వాత ఆ శని,చంద్రుల సంయోగం కారణంగా విష యోగం ఏర్పడుతుంది. ఈ విష యోగం కారణంగా కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తం 12 రాశుల వారిపై ఈ యోగం ప్రభావం చూపించగా, కొన్ని రాశుల వారికి మాత్రం సమస్యలు ఎదురవుతాయి. శని న్యాయదేవుడు.

కర్మలను బట్టి శని దేవుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితాలను అందుకోవాలి. అదే చెడు చేస్తే చెడు ఫలితాలను ఎదుర్కోక తప్పదు. చంద్రుడు చాలా వేగంగా కదిలే గ్రహం. త్వరగా రాశులను మారుస్తూ ఉంటాడు.

ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా కొన్ని రాశుల వరకే నవరాత్రి తర్వాత కష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విష యోగం వలన ఏ రాశుల వారికి ఇబ్బందులు రావచ్చు అనేది తెలుసుకుందాం.

కుంభ రాశి వారికి శని-చంద్రుల సంయోగంతో ఏర్పడే విష యోగం అశుభఫలితాలను అందిస్...