Hyderabad, సెప్టెంబర్ 23 -- నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలయ్యాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఉన్న అమ్మవారిని అందంగా అలంకరించి, నైవేద్యాలని సమర్పించి, భక్తశ్రద్ధలతో ఆరాధిస్తారు.

ఉదయం, సాయంత్రం రెండు పూటలా కూడా దీపారాధన చేసి అమ్మవారిని పూజిస్తారు. అయితే దసరా నవరాత్రుల్లో అమ్మవారి శ్లోకాలు, మంత్రాలు పఠిస్తే అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంట్లో సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. అయితే, రాశుల ఆధారంగా ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారు ఈ తొమ్మిది రోజులు కూడా 'ఓం దమ్ దుర్గాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తే మంచిది. ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.

వృషభ రాశి వారు నవరాత్రుల్లో 'ఓం లలిత దేవియే నమః' అనే...