Hyderabad, సెప్టెంబర్ 10 -- దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకం. హిందువులు తొమ్మిది రోజులు పాటు అమ్మ వారిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఇంట్లో పెట్టి పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో దేవి రూపాన్ని రూపంతో అందంగా అలంకరించి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ సంవత్సరం దసరా పండుగ రాక ముందు ఇంటి నుంచి వీటిని తొలగించేటట్టు చూసుకోండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. సంతోషంగా ఉండొచ్చు. సమస్యలన్నీ తొలగిపోతాయి.

దసరా నవరాత్రులు రాక ముందు వీటిని ఇంటి నుంచి తొలగించండి. తొమ్మిది రోజులు కూడా భక్తిశ్రద్ధలతో మనం పూజిస్తాము. అయితే, మనం పూజించే ఇల్లు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాబట్టి దసరా రాక ముందే ఇంటిని శుభ్రంగా ఉంచే దుమ్ము, చెత్తచెదారం వంటి వాటిని తొలగించేటట్ట...