భారతదేశం, అక్టోబర్ 4 -- దసరా పండగ వేళ రాష్ట్రంలో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. పైగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రావటంతో షాపులన్నీ మూసివేశారు. దీంతో పండగ కోసం ముందుగానే భారీ స్థాయిలో మద్యం కొనుగోళ్లు జరిగాయి. ఒక్క సెప్టెంబర్ మాసంలోనే రూ.3,048 కోట్ల విలువైన లిక్కర్ ను డిపోల నుంచి కొనుగోలు చేశారు.

దసరా పండుగ వేళ సుమారు రూ. 698 కోట్లు లిక్కర్ వ్యాపారం జరిగినట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌ 29, 30, అక్టోబర్‌1 తేదీల్లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి.. సెప్టెంబరు 29న రూ.278 కోట్ల మేర అమ్మకాలు జరగగా. సెప్టెంబర్ 30వ తేదీన రూ.333 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక అక్టోబర్‌ 1వ తేదీన రూ.86 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడుపోయింది. అంటే కేవలం ఈ 3 రోజుల్లోనే కలిపి రూ. 600 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగిపోయాయి.

సాధారణ రోజులతో పో...