భారతదేశం, సెప్టెంబర్ 4 -- కార్లు, బైక్‌లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక శుభవార్త. పండుగల సీజన్‌కు ముందే కేంద్రం వాహనదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కౌన్సిల్ బుధవారం నాడు వాహనాలపై పన్ను రేట్లను సవరించింది. దీంతో పలు రకాల కార్లు, బైక్‌లు గతంలో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి.

జీఎస్టీ కౌన్సిల్ పన్ను శ్లాబులను తగ్గించింది. జీఎస్టీ 2.0 విధానంలో రెండు ప్రధాన శ్లాబులు ఉన్నాయి: 5 శాతం, 18 శాతం. వీటితో పాటు లగ్జరీ వస్తువుల కోసం 40 శాతం ప్రత్యేక శ్లాబ్ కూడా ఉంది. మరి మీరు ఈ పండుగ సీజన్‌లో ఏ కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు? ఆయా వాహనాలపై ఎంత జీఎస్టీ పడుతుందో ఇప్పుడు చూద్దాం.

జీఎస్టీ సవరణతో చిన్న కార్లు మరింత చవకగా మారనున్నాయి. పెట్రోల్, సీఎన్‌జీ లేదా ఎల్‌పీజీ ఇంధనాలతో నడిచే, 1200 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎ...