భారతదేశం, నవంబర్ 2 -- పండుగలు సినిమాలకు చాలా అనువుగా ఉంటాయి. హాలీడేస్ కారణంగా ఎక్కువగా ఆడియెన్స్ చూసేందుకు వీలుంటుందను ఈ పండుగలను టార్గెట్ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటారు. అలా అక్టోబర్ నెలలో రెండు అతి పెద్ద పండుగలైన దసరా, దీపావళి వచ్చాయి.

అలాగే, అక్టోబర్ నెలలో ప్రతివారం సరికొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. దసరా, దీపావళితోపాటు అక్టోబర్ మంత్ మొత్తంలో తెలుగ స్ట్రయిట్ నుంచి డబ్బింగ్ సినిమాల దాకా రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్ అయింది, మరేది ఫట్ అయిందో తెలుసుకుందాం.

అక్టోబర్ మొదటి వారంలో అంటే దసరా సందర్భంగా పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ కావడంతో మిగతా సినిమాల సందడి లేకుండాపోయింది. కానీ, ధనుష్ ఇడ్లీ కొట్టు, కాంతార చాప్టర్ 1 వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఓజీ పర్వాలేదనిపించుకుంది. ఇడ్లీ కొట్టి ఫ్లాప్ కాగా కాంతార 2 మాత్రం బాక్సాఫీస్ ...