భారతదేశం, జనవరి 10 -- దానం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. దానం, ధర్మం అనే మాటలు ప్రతి ఒక్కరూ వింటారు. అయితే ఎవరైనా పేదవారికి మన శక్తి కొద్దీ దానం చేస్తే, దాని వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. మనం చేసే ద్రవ్య సహాయం లేదా వస్తు సహాయాన్ని ధర్మం అని అంటారు. ధర్మం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. ఇహలోక సౌక్యాలకు దోహదం చేస్తుంది. చాలా మందికి దశ దానాలు అంటే ఏంటి? అనే సందేహం ఉంటుంది. మరి దశ దానాలు అంటే ఏంటి? ఏ దానం చేయడం వలన ఎలాంటి పుణ్య ఫలితం కలుగుతుంది? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి శాస్త్ర నియమాల ప్రకారం చూస్తే, దానయోగ్యమైనవి కొన్ని ఉంటాయి. వాటినే దానంగా ఇవ్వాలి. వాటిని దశ దానాలు అని పిలుస్తారు. ఆవు నెయ్యి, దూడతో కూడి ఉన్న ఆవు, భూమి, నువ్వులు, బంగారం, ధాన్యం, వస్త్రాలు, బెల్లం, ఉప్పు, వెండి ఈ పదిని కూడా దశ దానాల...