Hyderabad, ఆగస్టు 23 -- కూలీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్: వీక్ డేస్‌లో కలెక్షన్స్ గణనీయంగా తగ్గినప్పటికీ రజినీకాంత్ కూలీ భారతదేశంలో నంబర్ వన్ చిత్రంగా, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా తన స్థానాన్ని నిలుపుకోగలిగింది.

నాలుగు రోజుల ఓపెనింగ్ వీకెండ్‌లో కలెక్షన్లతో అదరగొట్టిన కూలీ సినిమా 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్ల మార్కును దాటేసింది. కూలీ సినిమాకు 9వ రోజున ఇండియాలో రూ. 5.50 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి. 8వ రోజుతో పోలిస్తే ఇది తక్కువే. కానీ, ఇండియా వైడ్‌గా ఓవరాల్ కలెక్షన్స్ అదిరిపోయాయి.

9 రోజుల్లో భారతదేశంలో కూలీ సినిమా రూ. 235.15 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, రూ. 281 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది కూలీ సినిమా. అలాగే, యూఎస్, యూకే, ఆస్ట్రేలియాల్లో కలెక్షన్ల రికార్డు...