భారతదేశం, జనవరి 4 -- తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ వెండితెరకు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్'. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి జన నాయగన్ ట్రైలర్‌ను శనివారం (జనవరి 3) విడుదల చేశారు మేకర్స్.

శనివారం విడుదలైన జన నాయగన్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అయితే, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌లో ఒక చిన్న 'ఏఐ' (AI) పొరపాటు దొర్లడం ఇప్పుడు చిత్ర యూనిట్‌ను ఇరకాటంలో పడేసింది.

జన నాయగన్ ట్రైలర్ ఆరంభంలో ఒక వ్యక్తి షాట్‌గన్‌ను లోడ్ చేస్తున్న సీన్ వస్తుంది. సరిగ్గా ఆ సీన్ తర్వాత వచ్చే కొన్ని క్షణాల విజువల్‌లో గూగుల్‌‌కు చెందిన ఏఐ టూల్ 'జెమిని' (Gemini) లోగో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్...