భారతదేశం, జనవరి 9 -- దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా 'జన నాయగన్' చిక్కుముళ్లు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో సినిమా విడుదల మరింత సందిగ్ధంలో పడింది. శుక్రవారం (జనవరి 9) మద్రాస్ హైకోర్టులో జరిగిన విచారణలో విజయ్ సినిమాకు ప్రతికూల ఫలితం వచ్చింది. దీంతో జనవరి 21 వరకు మూవీ రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

దళపతి విజయ్ జన నాయగన్ మేకర్స్ కు శుక్రవారం ఓ గుడ్ న్యూస్, ఆ వెంటనే ఓ బ్యాడ్ న్యూస్ అందింది. మొదట ఉదయం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని సింగిల్ జడ్జి.. సెన్సార్ బోర్డు (CBFC)ను ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఎఫ్‌సీ.. డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్...