భారతదేశం, నవంబర్ 8 -- తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు పొలిటికల్ లీడర్ గా మారాడు. పార్టీ పెట్టి ఎలక్షన్ బరికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సినీ కెరీర్ కు ఎండ్ కార్డు వేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న 'జన నాయగన్' మూవీ ఆయన సినీ కెరీర్ లో చివరదని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడీ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న 'జన నాయగన్' సినిమా నుంచి మొదటి పాట శనివారం (నవంబర్ 8) విడుదలైంది. దళపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి 'దళపతి కచేరీ' పాట రిలీజైంది. ఇది విజయ్ సినీ ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసేలా ఉంది.

దళపతి కచేరీ పాట పాడటంతో పాటు డ్యాన్స్ చేశాడు దళపతి విజయ్. 3 ని...