భారతదేశం, డిసెంబర్ 31 -- తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం 'జన నాయగన్' (Thalapathy 69)పై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

నందమూరి బాలకృష్ణ నటించిన 2023 బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'భగవంత్ కేసరి'కి దళపతి విజయ్ నటించే జన నాయగన్ రీమేక్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై తాజాగా భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడిని మీడియా అడగ్గా ఆయన ఇంట్రెస్టింగ్‌గా సమాధానం ఇచ్చారు.

చిరంజీవితో తెరకెక్కిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడిని మీడియా ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'జన నాయగన్' రీమేక్ గురించి ప్రశ్నించగా, అనిల్ రావిపూడీ చాలా తెలివిగా బదులిచ్చారు.

"నిజానికి వాళ్లు కూ...