Hyderabad, జూన్ 27 -- భారతీయ సంస్కృతిలో దర్భప్రాశస్త్యం గురించి భగవద్గీత ఆరవ అధ్యాయం 'ఆత్మ సంయమయోగం'లో కృష్ణుడు ఇలా చెప్పాడు.

"శుడౌ దేశే ప్రతిష్టాప్య స్థిర మాసనమాత్మనః నా త్యుచ్ఛితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం" "తతైకాగ్రం మనః కృత్వా యత చిత్తేన్రియః క్రియః ఉప విశ్వాసనే యుజ్ఞ్యాద్యోగ మాత్మ విశుద్ధయే"

అర్ధం: పరిశుద్ధమైన, మిక్కిలి ఎత్తుగా లేక, మిక్కిలి తగ్గుగా ఉండని చోట, క్రింద కుశగడ్డిని పరచి (దర్భ), దాని పైన జింక లేక పులిచర్మం, దానిపైన వస్త్రం పరచి, కదలకుండా, స్థిరంగా ఉండే ఆసనం ఏర్పరచుకొని, దానిపై కూర్చొని, మనసును ఏకాగ్రపరచి, మనోనిగ్రహంతో, అంతఃకరణశుద్ధి కోసం ధ్యానాన్ని అభ్యసించాలని అర్థం. అట్టి ధ్యానమే ఉత్తమమైనది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తైత్తిరీయోపనిషత్తులో "బర్హిషావై ప్...