భారతదేశం, నవంబర్ 11 -- జూబ్లీహిల్స్‌లో రిగ్గింగ్ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని మాగంటి సునీత అన్నారు. జూబ్లీహిల్స్‌లో పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు జూబ్లీహిల్స్‌లో ఏం పని అని అడిగారు.

మరోవైపు ఎన్నికల కమిషనర్‌ను మాగంటి సునీత రిక్వెస్ట్ చేశారు. ఎన్నికల కమిషనర్ దయచేసి బయట రండి అని, పరిస్థితి సమీక్షించాలని చెప్పారు. ఒక మహిళను ఇలా చేస్తుంటే కూడా చూస్తూ ఊరుకున్నారన్నారు. ఏది కరెక్ట్‌గా ఉందో చెప్పి, చేయించాలన్నారు. పోలీసులు కూడా గొడవలు చేశారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితి వీక్షించారు. దేశంలోనే తొలిసారి డ్...