Hyderabad, అక్టోబర్ 13 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి ఐదో వారం ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ పేరుతో ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూకి ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ హాజరయ్యారు.

వారిని పలు విధాలుగా ప్రశ్నలు వేస్తూ బజ్ ఇంటర్వ్యూ హోస్ట్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, హీరో శివాజీ ఆడుకున్నాడు. ఇద్దరు ఎలిమినేట్ కంటెస్టెంట్స్‌తో జరిగిన బజ్ ఇంటర్వ్యూను ఒకే ప్రోమో ద్వారా చూపించారు. ఆ ఇంటర్వ్యూ ఎలా సాగిందో ఇక్కడ చూద్దాం.

"కామనర్స్, సెలబ్రిటీలు అని చాలా గట్టిగా పెట్టేసుకున్నారు మీరు" అని శివాజీ అంటే.. "అలా నేను ఒక్కసారే అన్నాను" అని శ్రీజ చెప్పింది. "మీరు మైనస్ అవడానికి మెయిన్ కారణమే అది" అని శివాజీ చెప్పాడు. "అసలు గేమ్ ఎందుకు...