భారతదేశం, జూలై 12 -- కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని రామతీర్థ కొండల్లోని మారుమూల గుహ నుంచి నినా కుటినా అలియాస్ మోహి (40) అనే రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు చిన్న పిల్లలను పోలీసులు రక్షించారు. గత రెండు వారాలుగా ఆ మహిళ అక్కడ ఉంటోందని పోలీసులు తెలిపారు.

కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై భారత్ కు వచ్చిన మోహి గోవా నుంచి ఆధ్యాత్మిక తీర ప్రాంత పట్టణమైన గోకర్ణకు వెళ్లింది. ఆమె వీసా గడువు కూడా ముగిసింది. హిందూ మతం, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆకర్షితురాలైన ఆమె తన ఇద్దరు పిల్లలు ప్రయా (6), అమా (4)లతో కలిసి రెండు వారాల క్రితం గోకర్ణలోని దట్టమైన అటవీప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఒక గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించడం ప్రారంభించింది. ఆ గుహను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చి, రుద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ధ్యానం ...