భారతదేశం, జనవరి 23 -- డెక్కన్ కిచెన్ వర్సెస్ దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు కేసులో వస్తున్న వార్తలపై దగ్గుబాటి సురేష్ సీరియస్ అయ్యారు. తప్పుడు వివరాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్స్ తప్పవని సురేష్ బాబు లీగల్ టీమ్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇంతకు ఏమైంది? ఈ కేసు సంగతి ఏంటీ? అన్నది ఇప్పుడు చూద్దాం.

జూబ్లీహిల్స్ లోని డెక్కన్ కిచెన్ స్థల వివాదంలో దగ్గుబాటి కుటుంబం మీద కేసు నడుస్తోంది. బలవంతంగా తమను రౌడీలతో సాయంతో ఖాళీ చేయించారని నంద కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై నాంపల్లి కోర్టు విచారణ కొనసాగిస్తోంది. అయితే కోర్టులో అది జరిగిందని, ఇది జరిగిందని వస్తున్న వార్తలు పచ్చి అబద్దాలని సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

''దగ్గుబాటి ఫ్యామిలీ పై వస్తోన్న వార్తలు అవాస్తవం. కోర్ట్ కి హాజరు కావాలన్నది పచ్చి అబద్ధం. జూబ...