భారతదేశం, సెప్టెంబర్ 4 -- దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్-ఆగస్టు 2025 మధ్య కాలంలో అత్యధిక స్థూల మూల ఆదాయం రూ.8,593 కోట్లను నమోదు చేయడం రికార్డు సృష్టించింది. గత సంవత్సరం ఇదే కాలంలో సాధించిన రూ.8,457 కోట్ల కంటే ఇది ఎక్కువ. ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధానంగా సరుకు రవాణా కారణం అయింది. జోన్ 60.4 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. రూ.5,634 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ఏప్రిల్-ఆగస్టులో అత్యుత్తమ పనితీరును సూచిస్తుంది.

గత సంవత్సరం లోడింగ్ 56.6 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 6.7 శాతం పెరుగుదలను చూపిస్తుంది. ప్రయాణికుల రద్దీ కూడా రికార్డు వృద్ధిని సాధించింది. ఏప్రిల్, ఆగస్టు 2025 మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల ఆదాయంలో రూ.2,500 కోట్లు ఆర్జించింది. ఇది గత సంవత్సరం రూ.2,445 కోట్లతో పోలిస్తే 2.2 శాతం పెరుగుదల. ఈ కాలంలో 119 మిలియన్ల ప్రయా...