భారతదేశం, జనవరి 8 -- సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున రద్దీని తగ్గించి, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న కీలక స్టేషన్లలో అదనపు ప్రత్యేక రైళ్లను, తాత్కాలిక హాల్ట్‌లను ప్రకటించింది. మరికొన్ని ప్రత్యేక రైళ్లను కూడా సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. సంక్రాంతి దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరికొన్నింటిని కూడా రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ను సిర్పూర్ కాగజ్‌నగర్, విజయవాడతో కలుపుతూ ఎనిమిది అదనపు ప్రత్యేక రైళ్లను నడపనుంది.

ట్రైన్ నెం. 07469, 07470 హైదరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నాలుగు ట్రిప్పులు నడుస్తాయి.

ట్రైన్ నెంబర్ 07469 జనవరి 9, జనవరి 10, 2026 నుండి శుక్రవారాలు, శనివారాల్లో ఉదయం 7.55 గంట...