భారతదేశం, మే 21 -- గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో నీట మునిగి దైనందిన జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్ష హెచ్చరికలు జారీ చేసింది.

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి రోజువారీ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది, ప్రజలు రహదారిపై మోకాలి లోతు నీటి మట్టాల మధ్య ప్రయాణించాల్సి వచ్చింది. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. సిల్క్ రోడ్ జంక్షన్, హోసూరు రోడ్డు, బీటీఎం లేఅవుట్ తదితర ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నగరంలో 210 వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించినట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. చాలా వరకు ప్రాంతాలను చక్కదిద్దే పనులు జరిగాయని, మిగిలిన చోట్ల పురోగతి జరుగుతోందని తెలిపారు.

కర్ణాటకలో వర్షాలకు సంబంధించిన ఘటనల్ల...