భారతదేశం, డిసెంబర్ 21 -- దక్షిణాఫ్రికాలో గన్ కల్చర్ మరోసారి పెను విషాదాన్ని సృష్టించింది. జోహన్నెస్‌బర్గ్ శివార్లలోని ఒక టౌన్‌షిప్‌లో గుర్తుతెలియని దుండగులు ఆదివారం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశంలో ఇలాంటి సామూహిక మారణకాండ జరగడం ఈ నెలలోనే ఇది రెండోసారి! ఫలితంగా స్థానికులు తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నారు.

నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డ్ మైనింగ్ ఏరియా బెక్కర్స్‌దాల్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఈ ఘోరం జరిగింది. సుమారు పన్నెండు మంది దుండగులు రెండు వాహనాల్లో వచ్చి బార్‌లో ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలుస్తుంది.

దక్షిణాఫ్రికా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పది అని పోలీసులు తొలుత వెల్లడించారు. ఆ తర్వాత ఆ సంఖ్యను తొమ...