భారతదేశం, నవంబర్ 24 -- దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తెలుగు ప్రజల కోసం అంకితమైన ఒక నూతన అధ్యాయం మొదలైంది. 'దక్షిణాఫ్రికా తెలుగు సమితి' (South Africa Telugu Samithi)ని ప్రముఖులు, తెలుగు సంఘాల ప్రతినిధుల సమక్షంలో అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మద్దతు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ముఖ్యమైన ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంస్థ స్థాపన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలను సమితి నిర్వాహకులు వివరించారు. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఒకరికొకరు అవసరమైనప్పుడు సహాయం అందిస్తూ, తెలుగు ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయాలని వారు కోరుకుంటున్నారు.

ముఖ్యంగా, తెలుగు సంస్కృతి, తె...