భారతదేశం, డిసెంబర్ 25 -- టైటిల్: దండోరా

నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు తదితరులు

దర్శకత్వం: మురళికాంత్

సంగీతం: మార్క్ కే రాబిన్

సినిమాటోగ్రఫీ: వెంకట్ శాఖమూరి

విడుదల తేది: 25 డిసెంబర్ 2025

తెలుగు వెండితెరపై పల్లెటూరి కథలకు, సహజత్వానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తున్నారు. 'బలగం' సినిమా ఎలాంటి ఆదరణ పొందిందో తెలిసిందే. అదే బాటలో, మనిషి చనిపోయిన తర్వాత జరిగే అంతిమ సంస్కారాల నేపథ్యంలో, కుల వివక్ష అనే ఒక సున్నితమైన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం 'దండోరా'.

మురళీకాంత్ దర్శకత్వంలో బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి తదితరులతో రూపొందిన దండోరా ఇవాళ (డిసెంబర్ 25) థియేటర్లలో విడుదల కానుంది. అయితే, రిలీజ్‌కు రెండు ...