భారతదేశం, జూన్ 28 -- ఓటీటీలోకి ఈ వారం కూడా కొత్త సినిమాలు దూసుకొచ్చాయి. డిఫరెంట్ జోనర్లలో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో దక్షిణాది సినిమాలు కూడా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఈ వారం ట్రెండింగ్ గా మారిన సౌత్ సినిమాలు మీకోసం ఇక్కడ తీసుకొచ్చాం. విరాటపాలెం: పి.సి.మీనా రిపోర్టింగ్ అనే మహిళా ప్రధాన సిరీస్ తో పాటు ఒక పథకం ప్రకారం వరకూ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి.

తెలుగు లీగల్ థ్రిల్లర్ మూవీ ఒక పథకం ప్రకారం. లాయర్ సిద్ధార్థ్ జీవితం తన భార్య కనిపించకుండా పోవడంతో ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. ఒక షాకింగ్ ట్విస్ట్ తో అతను కేసులో ఇరుక్కుంటాడు. కానీ అతను కోర్టులో తన పేరును క్లియర్ చేసుకుంటాడు. అయితే మళ్లీ మరో హత్యలో చిక్కుకుంటాడు. వినోద్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖనితో పాటు సాయిరామ్ శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. సన్ న...