భారతదేశం, ఆగస్టు 3 -- జియోహాట్‌స్టార్ లొ మరో థ్రిల్లింగ్ స్పై మూవీ సాలాకార్‌ వచ్చేస్తోంది. ఇందులో హాట్ బ్యూటీ మౌనీ రాయ్ పవర్ ఫుల్ స్పై క్యారెక్టర్ చేసింది. వ్యక్తిగత బాధలను ఎదుర్కొంటూనే అధిక ప్రమాదకర మిషన్లను నడిపిస్తుంది. నటి గూఢచారి అవతారంలో కనిపించడం ఇది రెండోసారి. సాలాకార్ ఆగస్టు 8, 2025న జియోహాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అయితే అంతకంటే ముందు బోల్డ్ బ్యూటీ మౌనీ రాయ్ నటించిన ఓటీటీలోని సినిమాలపై ఓ లుక్కేయండి.

ఈ క్రైమ్ సిరీస్‌లో మౌనీ రాయ్ నయనతార గంగోపాధ్యాయ అనే క్యాబరే నర్తకి పాత్రను పోషించింది. ఈ కథ 1960ల ఢిల్లీలో జరుగుతుంది. నేర ప్రపంచాన్ని అన్వేషిస్తుంది, అధికార పోరాటం, అత్యాశ, అండర్ వరల్డ్‌లో మోసం గురించి తెలియజేస్తుంది. 1947 విభజన నుండి బయటపడిన తరువాత, ఢిల్లీ నేర ప్రపంచంలో ఒక సాధారణ వ్యక్తి శక్తివంతమైన వ్యక్తిగా ఎదగడం చుట్టూ ...