భారతదేశం, జనవరి 21 -- చాలామంది థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్ట్‌లో రీడింగ్స్ 'నార్మల్' కు కొంచెం అటుఇటుగా అంటే 'బోర్డర్‌లైన్' లో వస్తుంటాయి. ఇలా రాగానే ఏదో పెద్ద అనారోగ్యం వచ్చేసిందని, జీవితాంతం మందులు వాడాలేమోనని చాలామంది ఆందోళన చెందుతుంటారు. కానీ, బోర్డర్‌లైన్ రిపోర్ట్ వచ్చిన ప్రతిసారీ మందులు అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైద్య పరిభాషలో దీనిని 'సబ్ క్లినికల్ హైపో థైరాయిడిజం' (Subclinical Hypothyroidism) అంటారు. దీని అర్థం.. మీ రక్తంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) స్థాయిలు స్వల్పంగా పెరిగాయని, కానీ థైరాక్సిన్ (T4) హార్మోన్ మాత్రం సాధారణ స్థితిలోనే ఉందని అర్థం.

"బోర్డర్‌లైన్ రిపోర్ట్ రాగానే థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లు కాదు. ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మరింత నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పే ఒక సంకేతం మా...