భారతదేశం, మే 22 -- ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన సారంగ‌పాణి జాత‌కం థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీకి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

సారంగ‌పాణి జాత‌కం మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న‌ది. శుక్ర‌వారం (మే 23) ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌రోజుల్లోపే సారంగ‌పాణి జాత‌కం మూవీ ఓటీటీలోకి రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సారంగ‌పాణి జాత‌కం మూవీలో ప్రియ‌ద‌ర్శికి జోడీగా రూప‌కొడ‌వాయూర్ హీరోయిన్‌గా న‌టించింది. వెన్నెల‌కిషోర్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌...