భారతదేశం, మే 31 -- తెలుగు మూవీ వీర‌రాజు 1991 థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రుద్ర విరాజ్ హీరోగా న‌టిస్తూ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అజ‌య్ ఘోష్‌, బెన‌ర్జీ, అర్చ‌న, గోప‌రాజు ర‌మ‌ణ‌ కీల‌క పాత్ర‌లు పోషించారు.

వీర‌రాజు 1991 మూవీ మే 22న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ప‌ది రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేసింది. 1991లో నెల్లూరు జిల్లాలో మ‌త్స్య‌కారుడి జీవితంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో మేక‌ర్స్ ఈ మూవీని తెర‌కెక్కించారు. గ‌గ‌న్ బ‌దేరియా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

వీర‌రాజు ఓ మ‌త్స్య‌కారుడు. చేప‌లు ప‌ట్టుకుంటూ జీవిస్తుంటాడు. అన్యాయాన్ని అస్స‌లు స‌హించ‌డు. ఓ రాజ‌కీయ‌నాయ‌కుడు చేసే అన్యాయాల‌కు వీర‌రాజు ఎదురుతిరుగుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? త‌న అధికారం, ప‌ల...