భారతదేశం, ఏప్రిల్ 24 -- సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన జాక్ మూవీ అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ స్పై యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. మే సెకండ్ వీక్‌లో జాక్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

తాజాగా స‌మాచారం ప్ర‌కారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. మే 1న జాక్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది.

జాక్ మూవీకి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ స్పై యాక్ష‌న్ మూవీలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు జోడీగా వైష్ణ‌వి చైత‌న్య న‌టించింది. ఈ ఏడాది భారీ అంచ‌నాలు రే...