Hyderabad, మే 4 -- టాలీవుడ్‌లో హిట్ ఫ్రాంచైజీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను. ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీనే హిట్ 3. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన హిట్ ది థర్డ్ కేస్ మూవీలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటి శ్రీనిధి శెట్టి చేసింది.

మే 1న పాన్ ఇండియాగా గ్రాండ్ రిలీజ్ అయిన హిట్ 3 మూవీకి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో డైరెక్టర్ శైలేష్ కొలను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినీ విశేషాలను విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

-హిట్ సెకండ్ పార్ట్‌లోనే నాని గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చివరిలో ఒక గ్లింప్స్‌లాగా చూపించా. అర్జున్ సర్కార్ ఎలా ఉంటాడో అప్పుడే ఆడియన్స్‌కి ఒక అవగాహన వచ్చింది. ఈ తరహా పాత్రకు ఎలాంటి క్యారెక్టరైజేషన్ కావాలో అలా డిజైన్ చేయడం జరిగింది.

-ఈ సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారని ముందు అనుకున్నాం. అయితే...