Andhrapradesh, మే 28 -- ఏపీలో థియేటర్ల బంద్ నిర్ణయంపై వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలన్నారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా.జనసేన రాజమహేంద్రవరం నగర ఇన్‌ఛార్జిగా ఉన్న అత్తి సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేశారు.

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్‌ 1న థియేటర్ల బంద్‌ అని ప్రకటించింది దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ రెడ్డి అని చెప్పారు. తమ్ముడుని కాపాడుకోవడానికి దిల్ రాజు. తనపై లేనిపోని అభాండం వేశారని ఆరోపించారు. కమల్‌ హాసన్‌ను మించి ఆస్కార్‌ రేంజ్‌లో దిల్‌ రా...