భారతదేశం, సెప్టెంబర్ 1 -- మలయాళ సినిమా నుంచి వచ్చిన మొదటి మహిళా సూపర్ హీరో ఫిల్మ్ 'లోకా ఛాప్టర్ 1ఛంద్ర'పై అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దుల్కర్ సల్మాన్ సమర్పణలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సూపర్ హీరో చిత్రానికి దేశీయ మార్కెట్ లో భారీ స్పందన లభించింది. ఈ చిత్రం ఏకగ్రీవంగా సానుకూల సమీక్షలను పొందింది. ఇప్పుడు అన్ని ఓనం రిలీజ్ లను దాటి కలెక్షన్లలో అదరగొడుతోంది.

ఆగష్టు 28న లోకా ఛాప్టర్ 1 చంద్ర మూవీ రిలీజైంది. సూపర్ హీరో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. సక్నిల్క్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం లోకా మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. ఇక నాలుగో రోజైన ఆదివారం (ఆగస్టు 31) భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తొలి అంచనాల ప్రకారం రూ.9.75 కోట్లు వసూలు చేసింది. రూ.2.7 కోట్ల ఓపె...