భారతదేశం, సెప్టెంబర్ 3 -- సూపర్ హీరో మూవీస్ అంటే అందరికీ వెంటనే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, అవెంజర్స్ లాంటి ఇంగ్లీష్ సినిమాలే గుర్తుకొస్తాయి. ఎందుకంటే హాలీవుడ్ నుంచే ఆ తరహా మూవీస్ ఎక్కువగా వస్తాయి. కానీ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సూపర్ హీరో సినిమాలు అదరగొడుతున్నాయి. మనదైన సూపర్ హీరో మూవీస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ప్రజెంట్ లోకా చాప్టర్ 1 చంద్ర థియేటర్లలో సత్తాచాటుతోంది. ఇలాంటి ఇండియన్ టాప్ సూపర్ హీరో మూవీస్ ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేయండి.

ఇది అచ్చ తెలుగు సూపర్ హీరో మూవీ. మనదైన సూపర్ హీరో సినిమా 'హను మాన్'. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించింది. రుధిర మణితో హీరోకు సూపర్ పవర్స్ వస్తాయి. ఆ మణి కోసం విలన...