భారతదేశం, మే 14 -- థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకుని, డిజాస్టర్లుగా మిగిలిన సినిమాలు ఓటీటీలో సత్తాచాటడం తెలిసిందే. ఓటీటీలో మూవీస్ వ్యూస్ కు థియేటర్ల రిజల్ట్ తో సంబంధం లేదనే చెప్పొచ్చు. ఇప్పుడు థియేటర్లలో డిజాస్టర్ అయిన సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ ఫిల్మ్ 'జాక్' ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.

సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ 'జాక్' థియేటర్లలో తీవ్రంగా నిరాశపర్చింది. కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ లో టాప్-2లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని జాక్ మూవీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎక్స్ లో పోస్టు చేసింది.

డీజే టిల్లూ మూవీస్ తో జోరుమీదున్న సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా అనగానే జాక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సిద్ధుతో బేబీ ఫేమ్ వైష్ణవి చైత...