భారతదేశం, మే 5 -- తమిళ హీరో జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రలు పోషించిన అగాథియా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ హిస్టారిక్ హారర్ థ్రిల్లర్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు పెద్దగా సాధించలేకపోయింది. ఈ మూవీకి పా విజయ్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రన్‍లో డిజాస్టర్ అయిన అగాథియా ఓటీటీలో మాత్రం అంచనాలకు మించి అదరగొడుతోంది.

అగాథియా సినిమా మార్చి 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి తొలుత మోస్తరుగానే వ్యూస్ దక్కాయి. అయితే, ఆ తర్వాత క్రమంగా వ్యూస్ పెరిగాయి.

స్ట్రీమింగ్‍కు వచ్చిన సుమారు 10 రోజుల తర్వాత అగాథియా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేషనల్ వైడ్‍లో ట్రెండింగ్‍లోకి వచ్చింది. అప్పటి నుంచి టాప్-10లోనే ట్రెండ్ అవుతోంది. సుమారు 20 ...