Hyderabad, సెప్టెంబర్ 2 -- హాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ మిస్టరీ హారర్ మూవీ వెపన్స్ (Weapons). ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.2 వేల కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇంకా దూసుకెళ్తూనే ఉంది. అయితే ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.

మిస్టరీ హారర్ మూవీ వెపన్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ 9 నుంచి ఈ సినిమా ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు (Vudu), గూగుల్ ప్లేలలోకి అందుబాటులోకి రానుంది.

అయితే ఇది వీడియో ఆన్ డిమాండ్ గా రానుంది. అంటే మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. ఇప్పటికీ థియేటర్లలో ఈ వెపన్స్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. వసూళ్ల పరంగా దూసుకెళ్తూనే ఉంది. కానీ ...