భారతదేశం, జూలై 5 -- స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'థగ్ లైఫ్' భారీ అంచనాలను రేపింది. 37ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవడంతో ముందు నుంచి ఈ తమిళ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, ఈ మూవీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. జూన్ 5వ తేదీన థియేటర్లలో విడుదలైన థగ్ లైఫ్ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. అయితే, ఓటీటీలో మంచి స్టార్ట్ దక్కించుకుంది.

థగ్ లైఫ్ చిత్రం ఈ గురువారం (జూలై 3) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలోనూ అడుగుపెట్టింది. స్ట్రీమింగ్‍లో ఈ సినిమాకు మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోగానే నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది.

థియేటర్లలో రిలీజైన నెలలోగానే నెట్‍ఫ్లిక్స్ ఓ...