భారతదేశం, జనవరి 14 -- జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' విడుదల తేదీని అధికారికంగా బుధవారం (జనవరి 14) ప్రకటించారు. టీవీ కేబుల్ ఆపరేటర్ జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్ లాల్ నటించిన ఈ హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా వస్తున్నట్లు ఈ స్టార్ హీరో ఒక వీడియోను పోస్ట్ చేశారు. హిందీ వెర్షన్ కంటే కొన్ని నెలల ముందే మలయాల వర్షన్ థియేటర్లలోకి రానుంది.

మోహన్ లాల్ 'దృశ్యం 3' విడుదల తేదీని ప్రకటిస్తూ.. ''సంవత్సరాలు గడిచాయి. గతం మారలేదు. దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2, 2026న రిలీజ్ అవుతుంది'' అని రాసుకొచ్చారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో పాతకాలపు టీవీ సెట్, పార, మునిగిపోయిన కారు, సెల్ ఫోన్, పసుపు రంగు బ్యాగ్, సీసీటీవీ కెమెరా, స్క్రిప్ట్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ మొదటి రెండు సినిమాల్లోని కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి.

ప...