భారతదేశం, జనవరి 9 -- రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రిలీజ్ అంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు. శుక్రవారం (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ది రాజా సాబ్' థియేటర్ల వద్ద అభిమానులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా చూడటానికి వస్తూ ఫ్యాన్స్ తమ వెంట 'మొసళ్లను' తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అవి బొమ్మ మొసళ్లు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ సినిమా ది రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ చేసిన ఈ వినూత్న స్టంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. అభిమానులు పెద్ద పెద్ద మొసలి బొమ్మలను భుజాన వేసుకుని, నినాదాలు చేస్తూ థియేటర్లలోకి పరిగెత్తడం కనిపిస్తోంది.

'ది రాజా సాబ్' ట్రైలర్‌లో ప్రభాస్ ఒక మొసలిని పట్టుకుని విసిరేసే ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్‌ చూసి ఇన్‌స్పైర...