భారతదేశం, మే 5 -- సోషల్‌ మీడియాలో థాయ్‌లాండ్‌ అమ్మాయితో పరిచయం చేసుకున్న యువకుడు మాయమాటలతో ఆమెను భారత్‌కు రప్పించాడు. కొన్నాళ్లు హోటల్‌లో ఆమెతో గడిపి ఆనక పరారయ్యాడు. ప్రేమించానంటూ మాయమాటలు చెప్పి మోజు తీరిన తర్వాత పత్తా లేకుండా పారి పోయాడు. చివరకు ఆ యువతి వ్యభిచార కూపంలోకి చిక్కుకుపోయింది.

హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదివారం దాడులు చేశారు. నిర్వాహకురాలితో పాటు థాయ్‌లాండ్‌ చెందిన యువతి, బెంగాల్‌కు చెందిన యువతులు పట్టుబడ్డారు.

వారిని అదుపులోకి తీసుకుని థాయ్‌లాండ్‌ అమ్మాయిని ప్రశ్నించే క్రమంలో ఆమె దయనీయ పరిస్థితి అందరిని కలిచి వేసింది. ప్రేమికుడి చేతిలో మోసపోయి వ్యభిచార కూపంలో చిక్కుకున్న వైనం బయటపడింది. థాయ్‌లాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువతి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన...