Tamilnadu, అక్టోబర్ 1 -- తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నోర్ థర్మల్ పవర్ స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి తొమ్మిది మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో మరికొంత మంది కార్మికులు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను తక్షణమే పర్యవేక్షించాలని విద్యుత్ శాఖ మంత్రి ఎస్ఎస్ శివశంకర్ తో పాటు అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వంలోని మంత్రిగా ఉన్న గణేశన్ మీడియాతో మాట్లాడారు. థర్మల్ పవర్ నిర్మాణ స్థలంలోని స్టీల్ ఆర్చ్ కూలిపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. తొమ్మిది మంది కార్మికులు మృతి చెందారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కూలీలు మరణించారని తెలిపార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.