Hyderabad, జూన్ 8 -- భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన మూవీ థగ్ లైఫ్. జూన్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పూర్తిగా నెగటివ్ రివ్యూలు రావడంతో ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. తొలి రోజు కంటే రెండో 70 శాతం పడిపోయిన కలెక్షన్లు.. మూడో రోజు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో 38 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా థగ్ లైఫ్. అలాంటి మూవీ అసలు ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.52 కోట్లు మాత్రమే వచ్చాయి. కేవలం ఇండియా నెట్ కలెక్షన్లు చూసుకుంటే.. మూడు రోజుల్లో రూ.28.49 కోట్లుగా ఉంది. ఇవి చాలా చాలా తక్కువే అని చెప్పాలి.

గత గురువారం (జూన్ 5) మూవీ రిలీజ్ కాగా.. తొలి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.15.5 కోట్లుగా ఉన్నాయి. మరుసటి రోజు ఇవి రూ.7.15 కోట్...