భారతదేశం, జూలై 4 -- నితిన్ హీరోగా న‌టించిన త‌మ్ముడు మూవీ శుక్ర‌వారం (జూలై 4న‌) థియేట‌ర్ల‌లో రిలీజైంది. దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీకి వ‌కీల్‌సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌ప్త‌మి గౌడ, వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో ల‌య కీల‌క పాత్ర పోషించింది. త‌మ్ముడు ఎలా ఉంది? నితిన్ ఈ సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడా? లేదా? అంటే?

జై (నితిన్‌) ఆర్చ‌రీ ప్లేయ‌ర్. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిల‌వాల‌న్న‌ది అత‌డి క‌ల‌. అక్క స్నేహ‌ల‌త అలియాస్ ఝాన్సీ (ల‌య‌) విష‌యంలో చిన్న‌త‌నంలో చేసిన ఓ త‌ప్పు కార‌ణంగా ఆట‌పై ఫోక‌స్ పెట్ట‌లేక‌పోతాడు. త‌న‌కు దూర‌మైన అక్క‌ను క‌లిసి ఆమెకు సారీ చెప్పి త‌న పొర‌పాటును స‌రిదిద్దుకోవాల‌ని అనుకుంటాడు. ఝాన్సీ ఓ స్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్‌. వైజాగ్‌లోని ఫ్యాక్ట‌రీ ప్ర‌మాదం విష‌యంలో య‌జ‌మాని అజ‌ర్వాల...