భారతదేశం, జూన్ 28 -- త‌మిళ హార‌ర్ మూవీ డీమ‌న్ తెలుగు వెర్ష‌న్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్‌, స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. డీమ‌న్ మూవీలో స‌చిన్‌ మ‌ణి, అబ‌ర్న‌తి హీరోహీరోయిన్లుగా న‌టించారు. సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు. డీమ‌న్ మూవీకి ర‌మేష్ ప‌ళ‌నీవేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సైక‌లాజిక‌ల్ హార‌ర్ డ్రామాగా ద‌ర్శ‌కుడు ర‌మేష్ ప‌ళ‌నీవేల్ ఈ మూవీని తెర‌కెక్కించారు. 2023 సెప్టెంబ‌ర్‌లో త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. లిమిటెడ్ బ‌డ్జెట్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. డీమ‌న్ మూవీకి రోనీ రాఫెల్ మ్యూజిక్ అందించాడు.

విఘ్నేష్ శివ‌న్ (స‌చిన్ మ‌ణి) సినిమా డైరెక్ట‌...