భారతదేశం, నవంబర్ 22 -- కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇటీవల దుబాయ్ వాచ్ వీక్‌లో పాల్గొన్నారు. అక్కడ ఆయన వాచ్‌ల పట్ల తన ప్రేమను ప్రేరేపించిన ఒక ప్రత్యేకమైన వాచ్ గురించి మాట్లాడారు. చాలా మంది ఊహించినట్లుగా, అది ఖరీదైన రోలెక్స్, ఒమేగా లేదా ఆడిమార్స్ పిగెట్ కాదు. ఆ వాచ్ ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

ధనుష్ కు ఖరీదైన వాచ్ ల కంటే కూడా తన చిన్నతనంలో అమ్మ కొనిచ్చిన వాచ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. దాని ధర కచ్చితంగా షాక్ కలిగిస్తుంది. ఎందుకంటే దాని రేట్ ఒక డాలర్ (రూ.89) కంటే తక్కువే కావడం గమనార్హం.

"నేను ప్రేమలో పడ్డ మొదటి వాచ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు అమ్మ నాకు కొనిచ్చిన వాచ్. దాని ధర డాలర్ లోపే. దానిపై ఎలాంటి పేరు లేదు. అది ప్లాస్టిక్‌తో చేసింది. డిజిటల్ వాచ్. కేవలం సమయాన్ని మాత్రమే చూపిస్తుంది. ఒక లైట్ ఉంటుంది. దాని బ్యాటరీ అయిపోతుంది. దాని వెనుక...